ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారుతుంది. దాదాపుగా 70 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్న సంగతి కూడా అర్థం అవుతుంది.

అయితే అపాయింట్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యేల సమస్యలను జగన్ వినగలిగితే మంచి ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనబడటం లేదు. జగన్ దర్శనం కోసం కొంతమంది ఈ మధ్య కాలంలో తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా సరే పార్టీలో ఉన్న పెద్దలు ప్రభుత్వ పెద్దలు అందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఏదైనా ఆహ్వానాలు ఉంటే మాత్రమే జగన్ వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేల వివాహాలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి జగన్ కనీసం ఎమ్మెల్యేలను కలిసి వారి సమస్యలను కూడా వినలేకపోతే ఇబ్బందులు రావొచ్చు.

కొంతమంది మంత్రులు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవలేక పోతున్నారు అనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతుంది. ఈ విషయంలో సీరియస్ గా లేకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. 2014లో ముఖ్యమంత్రిగా విజయం సాధించిన చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలను తరచుగా కలుస్తూ ఉండేవారు. అయితే 2017 తర్వాత ఎమ్మెల్యేల విషయంలో అలసత్వం ప్రదర్శించారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళలేక పోయారు అనే  అభిప్రాయం వ్యక్తమైంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు ను కలవడానికి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని రాజకీయ జగన్ దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది  అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: