అసలే కరోనా కాలం.. అన్ని రంగాల్లో ఆదాయాలు పడిపోయాయి.. మరోవైపు ప్రభుత్వానికి బీభత్సంగా ఖర్చులు పెరిగాయి. మరి ఖర్చులు పెరిగి.. ఆదాయాలు తగ్గితే ఏం చేయాలి.. ఆదాయాలు పెంచుకోవాలి.. మరి ప్రభుత్వాలకు ఆదాయం ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది.. వేస్తే ప్రజలపై పన్నులు వేయాలి.. అలా వేస్తే జనం మండిపడతారు.. ఆగ్రహిస్తారు.. అయినా జనం ఆగ్రహిస్తే మాత్రం ఏం చేస్తారు.. అంటారా.. అలా లైట్‌ గా తీసుకోవద్దు. జనానికి కోపం వస్తే.. అప్పటికి సైలంట్‌గానే ఉంటారు.. కానీ.. ఎన్నికలు అంటూ ఓ టైమ్ ఉంది కదా.. అప్పుడు సత్తా చూపించేస్తారు..


అందుకే పాలకులు సాధారణంగా ప్రజలపై భారం మోపేలా భారీగా పన్నులు వేసేందుకు జంకుతారు. మరి పన్నులు వేయకపోతే.. ఆదాయం ఎలా.. అందుకే పన్నులు వేసినా.. భరించగలిగే వారిపైనే పన్నులు వేయడం కాస్త బుర్ర ఉన్న పాలకుల లక్షణం.. ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ మరింతగా అభివృద్ధి చెందుతోంది. రియల్ ఎస్టేట్‌ బూమ్ బాగా పెరిగింది. దేశంలో ఇప్పటికీ మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ రేట్లు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి.


రియల్ ఎస్టేట్‌ ధరలు బాగానే ఉన్నా.. వాటి రిజిస్ట్రేషన్‌ ధరలు మాత్రం మార్కెట్‌ విలువకు తక్కువగానే ఉంటాయి. ఇది సాధారణంగా అన్ని చోట్లా ఉండేదే.. కానీ ఇప్పుడు ఈ రెండింటి మధ్య విలువ బాగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భూములు కొనే వాళ్లకు భారం తప్పదన్నమాట. ఇలా భూముల విలువలు పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం వస్తోంది.


పైగా ఇలా భూముల విలువలు పెంచితే జనం నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు.. ఎందుకంటే.. భూములు కొనాలనుకునేవాడు ఎలాగైనా కొంటాడు.. అందుకే కేసీఆర్ ఈ అడ్వాంటేజ్‌ను బాగా వాడేసుకుంటున్నారు. గతంలో నాలుగేళ్లకో, ఐదేళ్లకో ఒకసారి ఈ భూముల విలువలు పెంచేవారు. ఇప్పుడు కేసీఆర్ ఏడాదిలోపే పెంచేస్తూ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: