సంగీత దర్శకుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి , ఆ తర్వాత రచయితగా, గాయకుడిగా, నటుడిగా కూడా సంచలనం సృష్టించారు. ఈయన 1974 వ సంవత్సరం జూన్ 15వ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లిలో జన్మించారు. చక్రికి తల్లితండ్రులు పెట్టిన పేరు చక్రధర్ జిల్లా. ఇక ఈయన తండ్రి వెంకట నారాయణ. ఆయన స్వస్థలంలోనే ఉపాధ్యాయులు అలాగే కళాకారుడు కూడా.ఇక  బుర్రకథలు ఆయనే స్వయంగా రాసి నాటకాలలో  ప్రదర్శించేవారు. ఇక చక్రి గారి తల్లి విద్యావతి. ఈమె ఒక గాయకురాలు. ఇక చక్రికి తమ తల్లిదండ్రుల నుండి వారసత్వంగా సంగీతంపై మక్కువ అలాగే అభిరుచి కలిగింది. ఇక అంతే కాదు తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఆయన ఈరోజు మన మదిలో నిలిచిపోవడానికి కారణమయ్యింది.


ఇక ఈయన పదవ తరగతి చదువుతున్న సమయంలో తన సొంత ఊరైన కంబాలపల్లిలోనే  ఫ్లూట్ వాయించడం నేర్చుకున్నాడు. ఇక తరువాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మహబూబాబాద్ లో చదివి , అక్కడే కర్ణాటక సంగీతం అలాగే వయోలిన్ కూడా నేర్చుకున్నారు. ఇక అప్పట్లో మహబూబాబాద్ చుట్టుపక్కల ఏ సంగీత కచేరి జరిగినా, అందులో చక్రీ వాయిద్యం ఉండాల్సిందే. ఇక ఒకసారి తన ప్రదర్శనను చూసిన బంధువులు, మిత్రులు అందరూ హైదరాబాద్ కి వెళ్లి అక్కడ తెలివితేటలు ప్రదర్శించాలని ప్రోత్సహించారు.  కానీ వారి మాటలను చక్రి వినలేదు. ఒక టీచర్ గా చూడాలన్న ఆయన తండ్రి కోరిక. కానీ  చక్రి కి ఉద్యోగంపై ఆసక్తి ఏర్పడింది. కానీ ఈయన ఉద్యోగం చేయడం ఆయన మిత్రులకు ఇష్టం లేకపోవడంతో ఆయన మిత్రుల ప్రోత్సాహంతోనే హైదరాబాద్ కి  వచ్చారు.


ఇక అలా పండువెన్నెల అనే మ్యూజిక్ ఆల్బమ్ ను  చేసి విడుదల చేయగా , దానికి పేరైతే వచ్చింది కాని డబ్బులు రాలేదు. ఇక ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. తరువాత 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ఇక ఆ తర్వాత చిరునవ్వు అనే  మ్యూజిక్ ఆల్బమ్  కూడా రెడీ చేయగా, దానిని సనా ఆడియో వారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి సంచలనం సృష్టించారు.ఇలా  ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. ఇక మన తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు  అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సత్యం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చక్రి సంగీతాన్ని అందించారు.ఈయన  సంగీతం అందించిన చివరి సినిమా ఎర్ర బస్సు. ఆ తర్వాత ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నారు.

హిందీ భాషలో కూడా ప్రభంజనాన్ని   సృష్టించిన చక్రీ డిసెంబర్ 14న గుండెపోటు రావడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ 2014 డిసెంబర్ 15వ తేదీన తుదిశ్వాస విడిచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: