డీ.ఎస్. దీక్షితులు.. మురారి సినిమాలో దీక్షితులు గా బాగా ప్రసిద్ధి చెందిన నటుడు. ఈయన పూర్తి పేరు దేవి శ్రీనివాస దీక్షితులు. 1956వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లాలోని రేపల్లె లో జన్మించడం జరిగింది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే నటుడిగా గుర్తింపు పొందడమే కాదు, రేడియో, థియేటర్ బుల్లితెరపై కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అయితే ఈయన గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం..

దీక్షితులు మొదట గుంటూరు పట్టణంలోని ఒక ప్రభుత్వ కళాశాలలో, లెక్చరర్ గా పని చేసేవారు. అలా తన ఉద్యోగ జీవితం మొదలైంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్ ఇన్స్టిట్యూట్ అలాగే రిపోర్టర్ నుండి థియేటర్ ఆర్ట్స్ లో డిప్లమోలో  డిగ్రీ పట్టా అందుకున్నాడు.. ఆ తర్వాత రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొంది , గోగ్రహం అనే నాటకాలకు ప్రసిద్ధి చెందిన వాడు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు నాటకాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇక వివిధ సినిమా నటులకు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి నట శిక్షణ కూడా ఇచ్చేవాడు.

ప్రముఖ దర్శకులుగా గుర్తింపు పొందిన బుల్లితెర దర్శకురాలు మంజుల నాయుడు దర్శకత్వం వహించిని సబ్బు సిరిసిరిమువ్వా  వంటి ధారావాహికలతో, ఆయనకు నంది అవార్డు కూడా లభించింది. అప్పట్లో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందిన దీక్షితులు , మురారి సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందడం విశేషం.

ఇక ఈయన చివరిగా బుల్లితెర సీరియల్ లో సిరి సిరి మువ్వ సీరియల్  సెట్ లో నటిస్తున్నప్పుడు ఒక్క సారిగా గుండె పోటుకు గురవడం జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కాకపోతే ఆయన అప్పటికే మరణించడం జరిగింది. 2019 వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన నటనలో ఉన్నట్టుగానే, తన 62 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూయడం అందరికీ బాధాకరమైన విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: