
అయితే ఇతనిలో ఒక అపారమైన ప్రతిభ దాగి ఉండేది. చదువుకునే రోజుల్లో తనలోని కవిని వెలికి తీశారు. కొన్ని రచనలు చేశాడు. అయితే ఇతను నటుడిగా అప్పటికే కొన్ని సినిమాల్లో నటించి ఉన్నాడు. మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఎక్కడో దర్శకుడు అవ్వాలన్న కోరిక బలంగా ఉంది. అందుకే ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ గా కొంతకాలం చేశారు. అయితే నటుడిగా కొనసాగుతూ మెగా ఫోన్ పట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ అందరూ సక్సెస్ అవ్వడం కష్టమైన పనే, అయితే ఎమ్మెస్ నారాయణ మాత్రం డైరెక్టర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే తన కొడుకు విక్రమ్ హీరోగా "కొడుకు" సినిమా చేశాడు. ఈ సినిమా 2004 లో విడుదల అయింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలం అయింది.
అలా ఎమ్మెస్ నారాయణ డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా సక్సెస్ కాలేదు. అయినా ఎమ్మెస్ వెనక్కు తగ్గలేదు. మళ్లీ 2007 లో భజంత్రీలు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో శివాజీ, బ్రహ్మనందం, చలపతిరావు, కోట మరియు ఎల్ బి శ్రీరామ్ నటించారు. ఈ సినిమా కూడా ఫెయిల్ అయింది. అలా చేసిన రెండు సినిమాలు ప్లాప్ లు అవడంతో మెగా ఫోన్ కు దూరం అయిపోయారు. ఆ విధంగా ఒక నటుడిగా సక్సెస్ అయిన ఎమ్మెస్ నారాయణ డైరెక్టర్ గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆయన చనిపోయే వరకు ఒక్క హిట్ సినిమా కూడా చేయలేక పోయాను అని బాధపడినట్లు తెలిసింది.