"ఆడికృత్తిక" .. నేడు ఎంతో పవిత్రమైన రోజు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహామహా ఇష్టమైన రోజు . ఇవాళ చాలామంది జనాలు భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యస్వామిని కొలుస్తూ ఉంటారు.  మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బియ్యపు పిండి  దీపం వెలిగిస్తే మహా మహా పుణ్యం అంటూ పండితుల పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు . సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టమని.. ఆడికృత్తిక రోజు ఆయనకు ఎంతో ఇష్టమైన పిండి దీపంతో ఆవు  నెయ్యితో దీపం వెలిగించి దూప దీపాలతో నైవేద్యాలతో ఆయన్ను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని .. చదువు సరిగ్గా రాని వారికి చదువు వస్తుంది .. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళకి సంతానం కలుగుతుంది అంటూ చాలామంది చెబుతూ ఉంటారు.


అయితే ఇవాళ ఆడికృత్తిగా చాలా మంది ఇళ్లలో దీపాలు పెట్టేసి ఉంటారు . అయితే దీపం పెట్టిన తర్వాత ఆ పిండి దీపాన్ని ఏం చేయాలి..? చాలా మంది ఆ పిండదీపాన్ని అలానే వదిలేస్తూ ఉంటారు . ఉదయం ఎంతో భక్తి శ్రద్ధలతో పిండి దీపాన్ని వెలిగించిన భక్తులు ఆ తర్వాత పిండి అలానే వదిలేసి రెండు రోజుల తర్వాత చెత్తకుప్పలో పడేస్తూ ఉంటారు . కానీ అది చాలా చాలా తప్పు . మహా పాపం దేవుడికి సంబంధించిన ఏ వస్తువులు కూడా చెత్త బట్టలో వేయకూడదు . సపరేట్ గా ఒక కవర్ లాంటిది పెట్టుకొని అందులో వేయాలి.



ఆ తర్వాత అది ప్రవహించే నీళ్లల్లో వేయడం మంచిది . లేకపోతే ఎక్కడైనా మట్టిని లోడి ఆ మట్టిలో దేవుడి పూజ కోసం వేసిన సామాగ్రిని అందులో పెట్టి ఉంచాలి అంటున్నారు పండితులు . మరీ ముఖ్యంగా ఆడి కృత్తిక రోజు పిండి దీపం పెట్టాక ఆ పిండి దీపాన్ని గోమాతలకు పెట్టడం మరింత మంచిది అంటున్నారు పండితులు . చాలామంది ఇది చేయరు కానీ ఇలా చేస్తేనే పూజ చేసిన ఫలితం దక్కుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: