భార‌త్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రికార్డుల మోత మోగుతోంది. రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...ఫీల్డింగ్ ఎంచుకొని ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను గప్టిల్‌-నికోలస్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన తర్వాత నికోలస్‌(41) ఔటయ్యాడు. చహల్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, గప్టిల్‌ హాఫ్‌సెంచరీతో మెరిశాడు. నికోలస్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్లండెల్‌(22) ఎంతో సేపు ఆడలేదు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 27 ఓవర్‌ మూడో బంతికి బ్లండెల్‌ ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్‌ గప్టిల్‌ నయా రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌ తరఫున సొంత గడ్డపై అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డును లిఖించాడు.

 

ఈ క్రమంలోనే వెటరన్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.ఈ మ్యాచ్‌లో గప్టిల్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత స్వదేశంలో అత్యధిక పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  ఇప్పటివరకూ స్వదేశంలో 92 ఇన్నింగ్స్‌ల్లో గప్టిల్‌ 4,023 పరుగులు సాధించాడు. దాంతో రాస్‌ టేలర్‌ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అయితే గప్టిల్‌తో పాటు టేలర్‌ కూడా ఈ మ్యాచ్‌లో ఆడుతుండటం గమనార్హం.

 

ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో మరోపక్క రాస్‌ టేలర్‌ కూడా విజృంభించాడు. మొదటి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా తో జరిగిన కీలక మ్యాచ్లో భారీ స్కోరు న్యూజిలాండ్ చేయించడంలో కీలక పాత్ర పోషించిన రాస్‌ టేలర్‌..తాజాగా జరిగిన మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించి భారత్ పై న్యూజిలాండ్ దేశం తరఫున వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై 50కిపైగా స్కోర్లను అత్యధికంగా సాధించిన న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే నాథన్‌ ఆస్ట్లే రికార్డును టేలర్‌ బ్రేక్‌ చేశాడు. భారత్‌పై 50కిపైగా స్కోర్లను టేలర్‌ 11వ సారి సాధించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: