మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.  ఫైనల్ పోరులో న్యూజిలాండ్ భారత్ జట్ల హోరాహోరీగా తలబడెందుకు  సిద్ధమవుతున్నాయి.  జూన్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇంగ్లాండులోని సౌథాంప్టన్ వేదికగా జరుగబోతున్న ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.  ఫైనల్ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధించి కప్పు గెలుచుకోబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.  ప్రస్తుతం అంతటా  ఈ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన చర్చ జరుగుతోంది.



 వివిధ దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు ఈ ఫైనల్ మ్యాచ్ గురించి స్పందిస్తూ ఈ మ్యాచ్లో తలపడుతున్న రెండు జట్లకు కూడా పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు.  ఇటీవలే న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హాసన్ భారత జట్టుకి ఒక సలహా ఇచ్చాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు తమ ఓపెనింగ్ జోడీని మారిస్తే బాగుంటుంది అని  అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ చేరుకున్న భారత జట్టులో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్ రూపంలో మరో ఇద్దరు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. అయితే గతంలో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సమయంలో ఓపెనర్లు రోహిత్ శర్మ శుభ మాన్ గిల్ జోడి అద్భుతంగా రాణించారు.


 ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇద్దరికీ ఓపెనర్లుగా అవకాశం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ ఓపెనింగ్ జోడి పై స్పందించిన న్యూజిలాండ్ మాజీ కోచ్  హాసన్ గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ని ఆడిస్తే బాగుంటుంది అంటూ సూచించాడు  ఎందుకంటే ఇప్పటికే మయాంక్ అగర్వాల్ కి న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొన్న  అనుభవం ఉండడంతో అతని అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగ పడే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc