కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో ఇండియా మరియు శ్రీలంక మధ్య రెండో టి 20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ గెలుపు తో... బరిలోకి దిగిన టీమిండియా... రెండో టీ20లో మాత్రం చేతులెత్తేసింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా తడబడింది. ఇలాగైనా  సిరీస్ గెలవాలన్న తపన తో శ్రీలంక జట్టు పోరాటం చేసింది. ఈ నేపథ్యంలోనే రెండో టీ20 మ్యాచ్ లో సమిష్టి కృషితో విజయ కేతనం ఎగురవేసింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే... మొదట టాస్ గెలిచిన శ్రీలంక జట్టు... బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. 

దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్  కు దిగింది. భారీ మార్పులతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. మొదటినుంచి తడ బడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో... ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. టీమ్ ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే... ఓపెనర్ శిఖర్ ధావన్ 40 పరుగులు, పడిక్కల్ 29 పరుగులు చేసి  జట్టు పరువును కాపాడారు. ఇక మిగతా బ్యాట్స్ మెన్స్ మొత్తం చేతులెత్తేశారు. ఇక అటు 133 పరుగుల లక్ష్య ఛేదన కు దిగిన శ్రీలంక మొదటి నుంచి ఆచితూచి ఆడింది. 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని  ఛేదించింది శ్రీ లంక టీం.

శ్రీలంక బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే... కీపర్ భనుక 36 పరుగులు మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్.. ధనుంజయ డిసిల్వా 40 పరుగులు చేసి శ్రీలంక జట్టుకు విజయాన్ని అందించారు. ఇంకా టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే... కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, చేతన్ సకరియ, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు. బౌలింగ్ లో రాణించినప్పటికీ... టార్గెట్ చిన్నది కావడంతో శ్రీలంక విజయం అనివార్యమైంది. ఈ విజయంతో 1-1 గా సిరీస్ ను సమం చేసింది శ్రీలంక జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: