కానీ బిసిసీఐ మాత్రం సౌతాఫ్రికా పర్యటన విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరించింది. ఎంతో మొండిగానే ముందుకు సాగింది. ఈ క్రమంలోనే టీమిండియా ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటన కోసం ప్రత్యేకమైన విమానంలో పంపించింది. అయితే అక్కడ కఠిన నిబంధనల మధ్య మ్యాచ్ నిర్వహించాలని భావించింది. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా వన్డే, టెస్ట్ సిరీస్ లు ఆడబోతుంది. డిసెంబర్ 26వ తేదీన సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య సెంచరియన్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే సౌత్ ఆఫ్రికాలో ఓమిక్రాన్ కేసులు మాత్రం భయపెడుతూ ఉండటం గమనార్హం.
దీంతో ఒక వేళ ఇరు జట్ల ఆటగాళ్లు లేదా సిబ్బంది లో ఎవరైనా వైరస్ బారిన పడితే చివరకు మళ్ళి సౌత్ఆఫ్రికా సిరీస్ రద్దు అయ్యే అవకాశం ఉంది అందరూ భావించారు కానీ కరోనా వచ్చినా కూడా మ్యాచ్ లు మాత్రం ఆపడానికి బీసీసీఐ ఆసక్తి చూపడం లేదట. ఆటగాళ్లు లేదా సహాయ సిబ్బంది కరోనా వైరస్ వచ్చినప్పటికీ ఆట ఆగదు అంటూ ఇటీవల బీసీసీఐ తెలిపింది. కరోనా వైరస్ వచ్చిన వారిని వారితో సన్నిహితంగా ఉన్న వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచుతామని తెలిపింది. అయితే ఈ మేరకు రెండు దేశాల మధ్య అంగీకారం కూడా కుదిరినట్లు చెప్పుకొచ్చింది. సౌత్ ఆఫ్రికా లో వైరస్ పెరిగితే సిరీస్ నుంచి వైదొలిగే వీలు భారత్ కు ఉన్నప్పటికీ ప్రస్తుతం సిరీస్ రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ లేదు అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి