క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ లుగా కొనసాగుతున్న వారికి ఊహించని రీతిలో ధర పలకడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఈసారి ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉండటంతో ఈసారి మెగా వేలం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ప్రేక్షకుల అంచనాలను తారుమారు అయ్యాయి అన్న విషయం తెలిసిందే.  ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు అన్ సోల్డ్ గా మిగిలిపోయారు.



 ఇలాంటి సమయంలోనే ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతంగా రాణించి ఆ తర్వాత ఐపీఎల్ లో కూడా తన సత్తా ఏంటో చూపించిన మాజీ ఆటగాడు సురేష్ రైనా కూడా అన్ సోల్డ్ గా మిగిలిపోయారు అన్న విషయం తెలిసిందే. చెన్నేయి సూపర్ కింగ్స్ జట్టు లో మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి అద్భుతమైన ప్రదర్శన తో ఎన్నో సార్లు జట్టుకు విజయాన్ని అందించిన సురేష్ రైనాను ఆ జట్టు కొనకుండా వదిలేసింది. ఇక అంతే కాకుండా ఏ ఫ్రాంచైజీ కూడా దక్కించుకోవడానికి పోటీ పడలేదు. ఐపీఎల్ హిస్టరీ లో  ఐదు వేల పరుగులు పూర్తి చేసిన కొంత మంది ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకరు.


 అలాంటి సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో అందరూ అభిమానులు కూడా నిరాశ మునిగిపోయారు. ఐపీఎల్ లో కొనుగోలు చేయలేదు కనీసం విదేశీ లీగ్లో ఆడేందుకు అయిన పర్మిషన్ ఇవ్వాలి అంటూ బీసీసీఐ ను కోరాడు సురేష్ రైనా. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు సురేష్ రైనా అభిమానులందరికీ కూడా కిక్కిచ్చే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్లో కి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న గుజరాతి టైటాన్స్ సురేష్ రైనాను  జట్టులోకి తీసుకున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది. కాగా ఈ జట్టు కి అటు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఇలా సురేష్ రైనా గుజరాత్ టైటాన్స్ లోకి వెళ్ళాడు అని తెలియగానే అందరూ ఫుల్ హ్యాపీ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: