ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై తో జరిగిన మ్యాచ్ లో కోల్కత నైట్ రైడర్స్ ప్లేయర్ పాట్ కమ్మిన్స్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. క్రీజులోకి వచ్చి నప్పటి నుంచి బౌండరీలతో రెచ్చిపోయిన ప్యాట్ కమిన్స్ ఇక తక్కువ సమయంలోనే ఎక్కువ పరుగులు చేశాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే అర్థ సెంచరీతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు.  ఇక అంతకుముందు కె.ఎల్.రాహుల్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు టీ20 లీగ్ లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు ఎవరు అన్నది ప్రస్తుతం చర్చకు వచ్చింది ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.


 2018 లో ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లు సహాయంతో అర్ధ శతకం సాధించాడు. ఇప్పుడు పాట్ కమిన్స్ నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఈ రికార్డును సమం చేశాడు. ఇప్పటికి రికార్డు పదిలంగానే ఉంది  టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ 2014 సీజన్లో కోల్కతా జట్టు తరఫున 15 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి తిరుగులేదు అని నిరూపించాడు. స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న సునీల్ నరైన్ బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో 2017 లో 15 బంతుల్లో అర్ధసెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సురేష్ రైనా 2014లోనే పంజాబ్ జరిగిన మ్యాచ్లో 16 బంతుల్లో అర్ద సెంచరీ చేశాడు.


 యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 2021 ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. క్రిస్ గేల్ 17 బంతుల్లో అర్ధసెంచరీ చేసి రికార్డుల్లో కొనసాగుతున్నాడు. హార్థిక్ పాండ్యా సైతం 17 బంతుల్లో సెంచరీ సాధించాడు. వీరితో పాటు కిరణ్ పోలార్డ్,ఆడం గిల్క్రిస్ట్, క్రిస్ మోరిస్, నికోలస్ పురాన్ కూడా 17 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన వీరులుగా  కొనసాగుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl