
అతని బ్యాటింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. శివం దూబే ను అభినందిస్తూ సచిన్ టెండూల్కర్ తో తనకు ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఇటీవలే ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ ఎవరైనా సరే శతకం చేసిన తర్వాత ఆ జట్టు ఓటమి పాలైతే అప్పుడు పరిస్థితి ఏంటి.. ఇలా చాలాసార్లు జరిగింది అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ చెప్పిన ఒక విషయాన్ని ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ నెమరువేసుకున్నారు అని చెప్పాలి.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతో కష్టపడి సెంచరీ చేసిన ఇక చివరికి ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వివరించాడు. అలాగే శతకం జారినప్పుడు మ్యాచ్ గెలిచినా సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయం స్వయంగా సచిన్ టెండూల్కర్ తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్. 2011 ప్రపంచ కప్ పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 85 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వస్తున్నప్పుడు చిన్నగా నవ్వాడు.. సెంచరీ మిస్సయినందుకు బాధ లేదు అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది. నేను సెంచరీ చేయలేక పోవడమే మంచిది ఎవరికి తెలుసు ఒకవేళ ఓడిపోతే అని సచిన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి చూశాయ్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు..