
ఇక ఇప్పుడు అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి ఒక అరుదైన ఘనత సాధించాడు. 2022 ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న అథ్లెట్గా లియోనేల్ మెస్సిజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇటీవలే ప్రకటించిన ఫోర్బ్స్ జాబితాలో మెస్సి తొలి స్థానం లో ఉండటం గమనార్హం. దిగ్గజ ఎన్బీఏ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ రెండవ స్థానం లో పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియన్ రోనాల్డో మూడవ స్థానం లో నిలిచారు.
మే 1వ తేదీ వరకు లియోనేల్ మెస్సిజ్ 131 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని అందుకోవడం గమనార్హం. ఇక ఇందులో 55 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపం లో సంపాదించాడు మెస్సి ఇక రెండో స్థానం లో ఉన్న ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ 121 డాలర్లు పారితోషికం తీసుకున్నాడు. ఆ తర్వాత పోర్చుగల్ ఫుట్బాల్ టీం కెప్టెన్ క్రిస్టియన్ రోనాల్డో 115 మిలియన్ డాలర్లు పారితోషకం తీసుకోవడం గమనార్హం. ఇక ఇదే జాబితా లో భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 61 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక భారత క్రికెట్ నుంచి ఎవరూ కూడా టాప్ 100లో చోటు దక్కించుకోవడం గమనార్హం.