ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇటీవలే పంజాబ్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులలో ఎన్నో అంచనాలూ ఉన్న ఈ మ్యాచ్లో చివరికి పంజాబ్ కింగ్స్ జట్టు దాదాపు యాభై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత  బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ విభాగం మొత్తం విజృంభించింది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ  సిక్సర్లూ  ఫోర్లతో చెలరేగిపోయారు పంజాబ్ బ్యాట్స్ మెన్లు.



 దీంతో ఇక నిర్ణీత 20 ఓవర్లలో వేగంగా 210 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. ఈ క్రమంలోనే భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇక చివరికి బెంగళూరు జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లూ కొట్టిన సిక్సర్లు  ప్రేక్షకుల్లో కి వెళ్ళినప్పుడు ఎంతో మంది క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొంత మందికి గాయాలు కూడా అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవల పంజాబ్ కింగ్స్ తో  జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్  కొట్టిన ఒక సిక్సర్ స్టాండ్స్ లో ఉన్నా  ముసలాయన తల పగుల కొట్టింది చెప్పాలి. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో హర్ ప్రీత్ వేసిన బంతిని భారీ షాట్లకు ప్రయత్నిస్తున్న పాటి దార్ ఏకంగా 102 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. ఇక సిక్స్ నేరుగా వెళ్లి స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న  ఒక ముసలాయన తల పై పడింది.. ముసలాయనకి గాయమై రక్తం రావడం గమనార్హం. వెంటనే పక్కనే ఉన్న వాళ్ళు ఈ ముసలాయన ను  సేద తీర్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl