ఐపీఎల్ ముగిసిన వెంటనే అటు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది టీమిండియా. ఇటీవలే బిసిసీఐ ఇందుకు సంబంధించినజట్టు వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే అటు బిసిసిఐ ప్రకటించిన జట్టులో కొంత మంది ఆటగాళ్లకు చోటు దక్కకపోవడంపై అందరూ షాక్ అవుతున్నారు.  మరీ ముఖ్యంగా టీం ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్కు టీమిండియా సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు.  శిఖర్ ధావన్ ను జట్టులో ఎంపిక చేయకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.


 యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతోనే ధావన్ కు విశ్రాంతి ఇచ్చామని అటు బిసిసిఐ వివరణ ఇచ్చిన.. ఈ విషయంపై మాత్రం విమర్శలు ఆగడం లేదు. అయితే శిఖర్ ధావన్కు చెప్పి మరీ జట్టు నుంచి పక్కన పెట్టినట్లు ప్రస్తుతం మరో టాక్ వినిపిస్తోంది.  కోచ్ రాహుల్ ద్రావిడ్ శిఖర్ ధావన్ తో స్వయంగా మాట్లాడాడట. టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు  దావన్ కు చెప్పాడట. అయితే దావత్ ఒప్పుకోకపోయినప్పటికీ ద్రావిడ్ చెప్పడంతో చివరికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


 అంతేకాకుండా శిఖర్ ధావన్  ఎంపిక విషయంలో అటు కె.ఎల్.రాహుల్ జోక్యం కూడా ఉంది అన్నది తెలుస్తుంది. ప్రోటీన్స్ జట్టుతో టి-20 సిరీస్ కోసం కె.ఎల్.రాహుల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే  జట్టులో మొత్తం యువ ఆటగాళ్లు మాత్రమే ఉండాలని కేఎల్ రాహుల్ కోరుకున్నాడట. అందుకే జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది టి20 ప్రపంచకప్ తర్వాత శిఖర్ ధావన్ టీమిండియాకు పూర్తిగా దూరం అయిపోయాడు అన్న విషయం తెలిసిందే.. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన శిఖర్ ధావన్ ఏకంగా 14 మ్యాచుల్లో అద్భుతంగా రాణించి 468 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్వింటన్ డికాక్ తర్వాత స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: