ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా  కొనసాగుతోంది. ఇక ఇటీవలే ఐపీఎల్లో ప్రసార హక్కుల ద్వారా ఒక్కసారిగా ఐపీఎల్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి రాణించాలనుకునే యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక మంచి ప్లాట్ఫామ్ గా మారిపోయింది. అప్పటివరకు ఇబ్బందికర పరిస్థితులు మధ్య క్రికెట్ కొనసాగించిన ఆటగాళ్లకు ఐపీఎల్ ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యే పరిస్థితి తీసుకు రావడమే కాదు.. ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఇస్తుంది.


 ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఐపీఎల్లో రాణించిన ఎంతోమంది  తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో తక్కువ సమయంలోనే అవకాశాలు దక్కించుకున్న వారు ఉన్నారు. కేవలం భారత క్రికెటర్లు మాత్రమే విదేశీ క్రికెటర్లు సైతం ఇలా ఐపీఎల్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. అయితే తనకు కూడా ఐపీఎల్ ప్రదర్శన ద్వారానే అవకాశం దక్కింది అని అంటున్నాడు సెంచరీ వీరుడు. ఇటీవలే ఐర్లాండ్  పర్యటనలో భాగంగా రెండో టీ20 మ్యాచ్లో 57 బంతుల్లో 104 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు దీపక్ హుడా. అంతకు ముందు మ్యాచ్లో కూడా 47 పరుగులతో రాణించాడు.

 ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే ఇటీవల తన ప్రదర్శనపై  మాట్లాడాడు దీపక్ హుడా. నేను ఐపీఎల్ లో బాగా రాణించడం వల్ల ఇండియా జట్టులో అవకాశం వచ్చింది. ఐపీఎల్ లాంటి ప్రదర్శన ఇక్కడ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు నా ప్రదర్శనపై హ్యాపీగా ఉన్నాను. తాను సక్సెస్ కావడానికి నా దూకుడైన ఆట తీరే కారణం.  గత కొంత కాలం నుంచి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు వస్తూన్నాయ్. కాస్త ముందుగా బ్యాటింగ్కు దిగే అవకాశం దక్కుతుంది అంటూ  కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ తోపాటు,  మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అందుకున్నాడు దీపక్ హుడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl