మొన్నటివరకు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్,, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ కేవలం ఈ పేర్లు మాత్రమే భారత క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ వీరి పేర్లు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉండేవి. కానీ గత ఐపీఎల్ సీజన్ లో నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు దీపక్ హుడా. మొన్నటికి మొన్న ఐపీఎల్లో ఇక ఇప్పుడు భారత క్రికెట్లో కూడా ఈ పేరు మార్మోగిపోతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం అతను చేస్తున్న అద్భుతమైన ప్రదర్శన.. ఐపీఎల్ ముందుకు వరకు ఒక వివాదంలో ఇరుక్కొని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దీపక్ హుడా.


 దీంతో అతని కెరీర్ అక్కడితో ముగిసిపోయింది అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అతను భారత జట్టులోకి ఎంత ఇవ్వడమే కాదు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. బరోడా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కృనాల్ పాండ్యా తనను అసభ్యంగా దూషించాడు అంటూ దీపక్ హుడా ఆరోపించాడు. ఈ క్రమంలోనే బరోడా జట్టు నుంచి తప్పుకుంటున్నా అంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇక ఇలా కృనాల్ పాండ్యా దీపక్ హుడా మధ్య తలెత్తిన వివాదం సంచలనంగా మారింది. దీంతో యువ ఆటగాడు దీపక్ హుడా కెరియర్ ముగిసి పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అతను తెర మీదికి వచ్చాడు అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 15 మ్యాచ్ లలో 451 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు దీపక్ హుడా. ఇటీవలే  జరిగిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ కూడా అదరగొట్టాడు దీపక్ హుడా. ఒక మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన పోవడమే కాదు మొత్తంగా రెండు మ్యాచ్ లలో కలిపి 151 పరుగులు సాధించాడు. ఇక ఇప్పుడు టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆడుతున్న టి20 వార్మప్ మ్యాచ్లో కూడా అదరగొడుతున్నాడు. 59 పరుగులతో రాణించాడు దీపక్ హుడా. అతను ఇలాగే రాణిస్తే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: