ఇటీవల కాలంలో టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకునే ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా తరఫున కేవలం 11 మంది సభ్యులు మాత్రమే తుది జట్టులో ఎంపిక అయినప్పటికీ జట్టులో స్థానం దక్కుతుందేమో అని ఎదురుచూసే ఆటగాళ్ల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది.  ప్రతి ఒక ఆటగాడు ఎప్పటికప్పుడు తనను తమను నిరూపించుకునేందుకు సరికొత్తగా ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి టీమిండియాలో అవకాశం దక్కించుకుంటున్నారు.


 ఇక టీమిండియాలోకి వచ్చిన తర్వాత కూడా తమకు తిరుగులేదు అనే నిరూపించి మంచి ప్రదర్శన చేసి ఇక తమ స్థానాన్ని టీమిండియాలో సుస్థిరం చూసుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఇలా టీమ్ ఇండియాలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు యువ ఆటగాడు పృథ్వి షా. అతను సచిన్ టెండుల్కర్ వారసుడు అంటూ ఎంతోమంది అతన్ని ప్రశంసించడం మొదలుపెట్టారు. ఇక పృథ్విషా కూడా మెరుపు బ్యాటింగ్ ఆడుతూ ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండేవాడు.


 కానీ ఆ తర్వాత కాలం లో మాత్రం ఫామ్ కోల్పోయి ప్రతి విషయం ఎంతగానో ఇబ్బంది పడ్డాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవలే దక్షిణాఫ్రికా తో జరగబోయే వన్డే సిరీస్ లో ఆడబోయే టీమిండియా జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది.. అయితే ఇందులో అవకాశం దక్కుతుంది అని భావించిన పృద్వి షాకు నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారి మాటలను నమ్మవద్దు.. వారి చర్యలనే నమ్మాలి.. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అర్థం లేనివి అని వారి చర్యలు రుజువు చేస్తాయి అంటూ పృద్వి షా పెట్టిన పోస్ట్ కోసం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: