హెలికాప్టర్ షాట్.. ఈ పేరు చెప్పగానే క్రికెట్ ప్రేక్షకులు అందరికీ గుర్తుకు వచ్చేది ఇండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్లో ఆడే ఈ హెలికాప్టర్ షాట్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టేందుకు బౌలర్లు యార్కర్లు సంధించిన సమయంలో మహేంద్రసింగ్ ధోని ఎంతో చాకచక్యంగా ఇలాంటి హెలికాప్టర్ షాట్లు ఆడుతూ బంతిని బౌండరీకి తరలించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని తర్వాత హెలికాప్టర్ షాట్ ఎంతోమంది ఆటగాళ్లు ప్రయత్నించారు. కానీ మహేంద్రసింగ్ ధోనిలా మాత్రం ఎవరు అంత అద్భుతమైన షాట్ కొట్టలేకపోయారు అని చెప్పాలి.


 అయితే మహేంద్ర సింగ్ ధోనిని గురువులా భావించే హార్దిక్ పాండ్యా మాత్రం ఇక ధోని బ్యాటింగ్ లో కనిపించే ఎన్నో రకాల షాట్లను అప్పుడప్పుడు తన బ్యాటింగ్లో కూడా చూపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోని ధోని స్టైల్ లోనే హెలికాప్టర్ షాట్లు ఆడుతూ అటు ధోని అభిమానులను సైతం అలరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ సైతం ధోని స్టయిల్ లోనే హెలికాప్టర్ షాట్ ఆడి భారీ సిక్సర్ కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా భారత జట్టు ఆరు పరుగులు తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ 6 ఫోర్లు  3 సిక్సర్లతో  33 బంతుల్లో 57 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ధోనిని తలపిస్తూ అద్భుతమైన హెలికాప్టర్ షాట్ ఆడాడు కేఎల్ రాహుల్. భారత ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన ఫ్యాట్ కమిన్స్ బౌలింగ్లో రాహుల్ హెలికాప్టర్ షాట్ అడిగా అది భారీ సిక్సర్ గా వెళ్ళింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా ఇది చూసి ధోని అభిమానులు మురిసిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: