డిసెంబర్ నెల చివరి వారంలో ఇక బిసిసిఏ మినీ వేలం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయా జట్లు ఎవరిని వదులుకోబోతున్నాయి. జట్టులోకి ఎవరిని కొత్తగా తీసుకోబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అదే సమయంలో ఆయా జట్ల ఫ్రాంచైజీలు కూడా తమ కోచింగ్ సిబ్బంది విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోని ఐపీఎల్ కు సంబంధించిన వార్తలు ఇప్పటినుంచి సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోయాయి. ఐపీఎల్ 2023కి ముందు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది.
ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ ను తమ జట్టు అసిస్టెంట్ కోచ్గా పంజాబ్ కింగ్స్ నియమించింది. గత నెలలో ట్రెవర్ బెలీస్ ను కొత్త జట్టు ప్రధాన కోచ్గా నియమిస్తూ పంజాబ్ కింగ్స్ నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బెలీస్ తో కలిసి హాడిన్ పని చేయబోతున్నాడు. కాగా గతంలో వీరిద్దరూ కలిసి ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచింగ్ స్టాఫ్ గా పని చేశారు. ఇక త్వరలోనే మిగిలిన సహాయక సిబ్బందిని కూడా నియమిస్తుంది అన్నది తెలుస్తుంది. ఇలా మార్పులు చేర్పులుచేసి వచ్చే ఐపిఎల్ సీజన్ లో టైటిల్ కొట్టాలని భావిస్తుంది పంజాబ్ కింగ్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి