ఈ రోజు సాయంత్రం డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరియు ఆసియా కప్ ఛాంపియన్ శ్రీలంక ల మధ్యన పెర్త్ లో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. సూపర్ 12 మ్యాచ్ లు మొదలయ్యాక ఇరు జట్లు కూడా ఒక్కో మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాయి. కానీ ఆస్ట్రేలియా మాత్రం కివీస్ చేతిలో ఘోర ఓటమి చెందగా, శ్రీలంక ఐర్లాండ్ పై విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు విజయం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే ఇక నుండి ఆస్ట్రేలియా ఆడే ప్రతి మ్యాచ్ కూడా చావో రేవో కానున్నది. అలా మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా సారధి ఫించ్ బౌలింగ్ తీసుకున్నాడు. శ్రీలంక మొదట బ్యాటింగ్ లో నిర్ణీత 20 ఓవర్ లలో 157 పరుగులు చేసింది.

వాస్తవానికి శ్రీలంక బ్యాటింగ్ సాగిన తీరు చూస్తే ఈ మాత్రం స్కోర్ చేయడం చాలా కష్టం అనిపించింది. కానీ చరిత్ అసలంక 38 పరుగులు మరియు కరుణరత్నే 14 పరుగుల వలన ఆ స్కోర్ ను చేరుకుంది. ఓపెనర్ నిస్సంక 40 పరుగులతో జట్టును ఆదుకున్నాడు అని చెప్పాలి. డిసిల్వా పర్వాలేదనిపించగా, మెండిస్, శనక, రాజపక్ష మరియు హాసరంగా లు ఫెయిల్ అయ్యారు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ లో అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆ మాత్రం స్కోర్ కు శ్రీలంకను ఆపగలిగారు. ఆ తరువాత 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే వార్నర్ (11)వికెట్ ను కోల్పోయింది. మార్ష్ (17) మరియు మాక్స్వెల్ (23) లు కుదురుకున్నట్లే కనిపించినా అనవసర షాట్ లకు అవుట్ అయ్యారు.

ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ ఫించ్ మాత్రం నిదానంగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి సెమీఫైనల్ అవకాశాలను నిలుపుకుంది. ఇక బలమైన ఆస్ట్రేలియాను తమ బౌలింగ్ తో ఓడించినంత పనిచేసింది. కానీ చివర్లో స్టాయినిస్ విజృంభణతో సీన్ మారిపోయింది. స్టాయినిస్ కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు, తన ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు మరియు ఆరు సిక్సర్ లతో పరుగులు 59 సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా ఆస్ట్రేలియా శ్రీలంక పై మరో 21 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: