అయితే ఈ మ్యాచ్ కి వర్షపు ముప్పు పొంచి ఉంది అని అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఇక నెదర్లాండ్స్ తో మ్యాచ్లో మళ్లీ అందరి దృష్టి కూడా విరాట్ కోహ్లీ పైనే ఉంది అని చెప్పాలి. భారత్ తో మ్యాచ్ కి ముందు నెదర్లాండ్స్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ ను మీరు ఎలా అడ్డుకోబోతున్నారు అంటూ ప్రశ్నించగా షాకింగ్ సమాధానం చెప్పాడు. మాతో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ మాపై కరుణ చూపిస్తాడని భావిస్తున్న అంటూ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ పై విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిన కోహ్లీ.. అదే బ్యాటింగ్ మాతో రిపీట్ చేయడేమో అని అనుకుంటున్నా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు.
వరల్డ్ కప్ లో సూపర్ 12 లో ఆడటం అదృష్టంగా భావిస్తున్నాం. ఒక పెద్ద జట్టుతో మ్యాచ్ ఆడుతున్నాం అంటే ఒత్తిడి ఉండడం ఎంతో సహజం. కానీ అది ఉండేది చాలా తక్కువ. మాకు అవకాశాలు చాలా తక్కువ. వచ్చిన వాటిని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేము. టీమిండియా ముందు మేము నిలబడలేమని తెలుసు. కానీ గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పు లేదుగా. ఇక వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నీలో టీమిండియా లాంటి అగ్రజట్టుతో మ్యాచ్ ఆడటం ఒక ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తాం అంటూ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్ వర్డ్స్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి