కానీ అదృష్టవశాత్తు అటు వరుణుడు కరుణించడంతో.. ఇక మ్యాచ్ తర్వాత కొనసాగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత బౌలర్లు చెలరేగి వరుసగా వికెట్లు తీయడంతో ఇక బంగ్లాదేశ్ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ.. ఇక భారత్ చేతిలో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. అయితే భారత్ తో మ్యాచ్ ముందు అటు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీ బుల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి వస్తే తాము మాత్రం ఇండియనూ ఓడించడానికి వచ్చాం అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఇటీవల ఓటమి తర్వాత మాట్లాడుతూ.. భారత్తో ఎప్పుడు ఇదే జరుగుతుంది. దాదాపు గెలిచినంత పని చేస్తాం.. కానీ గెలవం. మ్యాచ్ గొప్పగా సాగింది. ప్రేక్షకులతో పాటు రెండు జట్లు కూడా ఆటగాళ్ళు ఆస్వాదించారు. చివరికి ఎవరో ఒకరు గెలవాలికదా అంటూ షకీబ్ ఉల్ హసన్ వ్యాఖ్యానించాడు. ఇక తమ జట్టు బ్యాట్స్మెన్ లిటెన్ దాస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అంటూ ప్రశంసలు కురిపించాడు బంగ్లాదేశ్ కెప్టెన్. ఇక అతని స్పోర్టివ్ నెస్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి