ఇక ఇలా రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయం మాత్రం ఇక భారత క్రికెట్ ప్రేక్షకులందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా ప్రపంచ క్రికెట్లోనే బెస్ట్ కెప్టెన్గా కొనసాగుతున్న కేన్ విలియంమ్సన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి సారధిగా కొనసాగుతూ ఉన్నాడు. అలాంటి కేన్ విలియమ్సన్ ఇక ఇటీవలే వేలంలోకి వదిలేస్తున్నట్లు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. సన్రైజర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటి అని ఒక ఆ జట్టు అభిమానులు సైతం షాక్ అయ్యారు.
అయితే ప్రస్తుతం సన్రైజర్స్ కేన్ విలియమ్సన్ లాంటి స్టార్ ప్లేయర్ ను వదులుకోవడం తో.. అతన్ని వేలంలో దక్కించుకోవాలని ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రిటెన్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు వద్ద 32.2 కోట్ల పర్స్ మనీ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే కేన్ విలియమ్స్ ను దక్కించు కోవడానికి 10 కోట్ల వరకు వెచ్చించడానికి పంజాబ్ కింగ్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 14 కోట్ల విలువైన విలియమ్సన్ వదిలేసిన సన్రైజర్స్ కాస్త తక్కువ ధరకు అతని దక్కించు కోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరికి కేన్ విలియమ్సన్ ను ఏ జట్టు సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా డిసెంబర్ 23వ తేదీన మినీ వేలం జరగబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి