టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీతో కలిసి సీనియర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను కూడా అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన కెప్టెన్సీ తో ఎప్పటి లాగానే మ్యాజిక్ చేసి చూపిస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్లలో టీమ్ ఇండియాకు తన సారధ్య వ్యూహాలతో వరుస విజయాలు అందించిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో మాత్రం అదే మ్యాజిక్ కొనసాగించలేకపోయాడు.


 అయితే కెప్టెన్గా పరవాలేదు అనిపించిన అటు ఆటగాడిగా మాత్రం రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో విఫలం అయిన తీరు అభిమానులు అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఓపెనర్ గా బరిలోకి దిగి అతి తక్కువ పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోతూ టీమ్ ఇండియాని కష్టాల్లోకి నెట్టాడు రోహిత్ శర్మ. దీంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి యువకులను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లకు కూడా అభిప్రాయపడ్డారు అని చెప్పాలి. అంతేకాకుండా రోహిత్ శర్మ ఫిట్నెస్ పై పూర్తిగా పట్టుకోల్పోయాడని సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.


 ఇకపోతే ప్రస్తుతం రోహిత్ శర్మ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు అన్నది తెలుస్తుంది. బరువు తగ్గే పనిలో బిజీ అయ్యాడట హిట్ మ్యాన్. ప్రస్తుతం జిమ్ లో తెగ వర్కౌట్ చేసేస్తూ ఉన్నాడట. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కాగా రోహిత్ శర్మ బరువు తగ్గి ఫిట్గా మారాడు అంటే చాలు అతన్ని ఆపే బౌలర్ ఎవరు ఉండరని ఎంతో మంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ బంగ్లాదేశ్ తో జరగబోయే వన్డే టెస్ట్ సిరీస్ లకు అందుబాటులోకి రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: