సాధారణం గా సినిమాల్లో స్టార్ హీరో లుగా కొనసాగుతున్న వారు ఆ తర్వాత కాస్త వయసు పైబడిన తర్వాత వారి వారసులను సినిమా ల్లోకి పరిచయం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలం లో ఏ ఇండస్ట్రీ  లో చూసినా కూడా ఇదే ట్రెండు కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల వారసులే మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉండడం జరుగుతూ ఉంది. అయితే అచ్చంగా ఇలాగే మిగతా ప్రొఫెషన్స్ లో కూడా జరుగుతూ ఉంటుంది. రాజకీయాల్లో కూడా వారసులు రావడం చూస్తూ ఉంటాం. ఇక క్రికెట్లో కూడా ఎంతో మంది ఆటగాళ్ల వారసులు వచ్చి రాణించడం చేస్తూ ఉంటారు.


 ఇప్పటికే సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్లో కొనసాగుతున్నాడు. అయితే తండ్రి క్రికెటర్ గా సక్సెస్ అయితే అర్జున్ టెండూల్కర్ మాత్రం ఇప్పటి వరకు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేక పోయాడు అని చెప్పాలి. ఇప్పుడు టీమ్ ఇండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు సైతం ఏకంగా దేశవాళి క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా సంతోషం లో   మునిగి పోయారు అని చెప్పాలి. వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్య వీర్ సెహ్వాగ్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్ 16 జట్టుకు ఎంపిక అయ్యాడు అన్నది తెలుస్తుంది. ఢిల్లీ జట్టు తమ తదుపరి మ్యాచ్ బీహార్తో ఆడ బోతుంది. ఇందు కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులలో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్య వీర్ కూడా ఉన్నాడు. కాగా వీరు క్రికెట్ లో దిగ్గజంగా ఎదిగాడు   మరీ వీరు కొడుకు ఇప్పుడు ఎలా రానిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: