టీమిండియా లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రోడ్డు ప్రమాదం లో భాగంగా తీవ్రంగా గాయ పడ్డాడు అని చెప్పాలి. ఈక్రమం లోనే ముంబై లోని ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు రిషబ్ పంత్. అయితే ఇక రిషబ్ పంత్కు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన కూడా అది నిమిషాలు వ్యవధి లో  హాట్ టాపిక్ మారి పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను తొందరగా కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇక అభిమానులందరికీ  ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రస్తుతం కోకిల బెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా మరో రెండు వారాల్లో డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారట వైద్యులు. అతనికి మోకాలు సర్జరీ తో పాటు మరికొన్ని సర్జరీలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక సర్జరీ లు విజయవంతంగా పూర్తి కావడం అతను వేగంగా కోరుకుంటూ ఉండడంతో ఇంటికి తీసుకు వెళ్లేందుకు వైద్యులు అనుమతించినట్లు తెలుస్తోంది.


 ఇక పంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు అన్న విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత రిహాబ్ సెంటర్లో ఆరు వారాలపాటు రిషబ్ పంత్ ఉంటాడట. ఈ మేరకు బీసీసీఐ అధికార వర్గాల నుంచి సమాచారం అయితే అతను పూర్తిగా గాయాలనుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే యాక్సిడెంట్ కారణంగా అతను ఆస్ట్రేలియాతో  జరగబోయే సిరీస్ తో  పాటు ఐపీఎల్ కు కూడా దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: