
అయితే భారత తుది జట్టులో చోటు సంపాదించుకోబోయే ఆటగాళ్లు ఎవరు అన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరుస్తూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇదే విషయంపై స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ పాయింట్స్ సందర్భంగా వన్డే వన్డే ప్రపంచ కప్ జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అన్న విషయంపై ప్రస్తావన రాగా భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ వన్డే మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ ప్రదర్శన పై స్పందిస్తూ అతను అటు వరల్డ్ కప్ జట్టు లో ఫాస్ట్ బౌలర్ల భాగంలో ఖచ్చితంగా చోటు తగ్గుతుందని అంచనా వేశాడు. మిగతా వాళ్ళ కంటే శార్దూల్ ఠాగూర్ ఒక అడుగు ముందే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వేసిన అంచనాను తప్పుపట్టాడు మరో మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్. ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయంతో ఏకీభవించలేదు అని చెప్పాలి.. ప్రపంచకప్ జట్టులో శార్దూల్ ఠాగూర్ కు స్థానం దక్కుతుందని తాను భావించడం లేదు అంటూ చెప్పకు వచ్చాడు. మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. తను కూడా ఫేస్ బౌలర్ ఆల్ రౌండర్ కావడం గమనార్హం. దీంతో హార్దిక్ పాండ్యాని కాదని శార్తుల్ ఠాగూర్ కు జట్టులో చోటు ఇవ్వడం చాలా కష్టమే. అతనికి హార్దిక్ పాండ్యా నుంచి తీవ్రమైన పోటీ ఉంది అంటూ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.