ప్రస్తుతం టీమిండియా జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతున్న టీమిండియా జట్టు ఇక వచ్చే నెల మాత్రం టెస్టు సిరీస్ ప్రారంభించబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాబోతుంది. ఈ క్రమంలోనే వివిధ వేదికలపై ఏకంగా ఆస్ట్రేలియా తో నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది టీమ్ ఇండియా.


 ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ అటు టీమిండియా కు ఎంతో కీలకంగా మారబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా అర్హత సాధించాలి అంటే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడించాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఈ సిరీస్ లో భారత జట్టు విజయం సాధిస్తేనే ఇక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ ఎంతో కీలకంగా మారగా ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుందని దానిపై ఎంతో మంది ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఈ క్రమం లోనే అటు ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు సైతం టీమిండియా తో జరగబోయే టేస్టు సిరీస్ గురించి స్పందిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ స్టోయినిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రన్నింగ్ మిషన్ కోహ్లీ ఆట తమకు డేంజర్ అంటూ చెప్పుకొచ్చాడు. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమే అయినప్పటికీతమ జట్టు మాత్రం ప్రస్తుతం ఎంతో పటిష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఇరు జట్ల మధ్య  టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: