
ఇక ఈ విభేదాల కారణంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ ను వదిలిపెట్టిన బాబర్ షెఫవర్ జట్టుకి మారాడు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలు ఇక ఇద్దరు క్రికెటర్ల అభిమానులను కూడా అvaaక్కాయ్యేలా చేశాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి. నేను బాబర్ పై ఎప్పుడు అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ కొంతమంది పని పాట లేని వాళ్ళు ఇలాంటి వార్తలు రాస్తూ ఉంటారు.
అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఇక సోషల్ మీడియాలో ఇక ఇలాంటి వార్తలనే వండుతూ కడుపు నింపుకుంటారు. నా జీవితంలో ఇలాంటి వాళ్లను ఒక్కసారి కూడా కలవలేదు. ఇక ఫ్రాంచైజీ క్రికెట్లో ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారడం సర్వసాధారణంగా జరుగుతుంది. అది ఫ్రాంచైజీ ఓనర్ల మీద ఆధారపడి ఉంటుంది. నా మీద కాదు. బాబర్ తో ఎప్పుడు నేను టచ్ లోనే ఉంటాను. అతను నా కొడుకుతో సమానం అతనితో విభేదాలు అస్సలు లేవు అంటూ వసీం అక్రమ్ చెప్పుకు
చ్చాడు.