ఇటీవల కాలంలో అటు బీసీసీఐ సెలక్టర్లు  యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తున్నారు. అయితే ఇలా భారత జట్టులో చోటు సంపాదించుకున్న వారు వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ అదరగొడుతున్నారు. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ లాంటి ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో కూడా తమ సత్తా చాటుతు ఉన్నారు అని చెప్పాలి.  ఇలాంటి సమయంలో ఇక భారత జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్లకు మళ్ళీ రీ ఎంట్రీ లభించే అవకాశం దాదాపు అసాధ్యం అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐదుగురు స్టార్ ప్లేయర్లు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. ఆ వివరాలు చూసుకుంటే..

 అమిత్ మిశ్రా : ప్రస్తుతం సీనియర్ ప్లేయర్ అమిత్ మిశ్రా వయస్సు 40 ఏళ్ళు.  ఎన్నో ఏళ్ల నుంచి భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ఒకడిగా కూడా కొనసాగుతూ ఉన్నాడు. టీమిండియా తరఫున 22 టెస్ట్ మ్యాచ్లు 36 వన్డే లు, 10 టి20 మ్యాచ్ లు ఆడాడు. ఇక ఈ సంవత్సరం అతను రిటర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందట.

 పియూస్ చావ్లా : 2011 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా జట్టులో పియూష్ చావ్లా కూడా సభ్యుడు. ఇక ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన ప్లేయర్లలో ఒకడు. చాలాకాలంగా భారత జట్టులో స్థానం దక్కడం లేదు. దీంతో ఇక రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నాడట ఈ సీనియర్ ప్లేయర్.

 కరుణ్ నాయక్ : 2016లో త్రిబుల్ సెంచరీ చేయడం ద్వారా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ లో బాగా రాణించిన సెలక్టర్లు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు దేశ వాలి క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ జట్టులోకి వచ్చే ఛాన్స్ లేదు. ఇక రిటైర్మెంట్ తప్పదు అన్నది తెలుస్తుంది.

 కేదార్ జాదవ్ : గత కొంతకాలం నుంచి కేదార్ జాదవ్ కు సెలెక్టర్ల నుంచి మొండి చేయి ఎదురవుతూనే ఉంది. యువ ఆటగాళ్లకు పోటీ ఇవ్వలేకపోతున్నాడు కేదార్ జాదవ్. అయితే ఇక అతను అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

 దినేష్ కార్తీక్  : అనూహ్యంగా గత ఏడాది ఐపీఎల్లో రానించి భారత జట్టులోకి వచ్చి ఇక తన హవా నడిపించాడు. కానీ ఇక టి20 వరల్డ్ కప్ లో పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. దీంతో సెలెక్టర్లు పక్కన పెట్టేసారు. ఈ క్రమంలోనే అతనికి మళ్లీ టి20 జట్టులో చోటు దక్కడం మాత్రం కష్టంగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: