ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇక నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్లో అడుగుపెట్టి ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది. అయితే ఇరు జట్లు కూడా వార్మప్  మ్యాచ్ లేకుండానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ప్రస్తుతం ఇరు జట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక తీవ్రస్థాయిలో పోటీ ఉండబోతుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. అయితే ఇక ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా ఈ టెస్ట్ సిరీస్ గురించి స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టీమిండియా మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో జరగబోయే సిరీస్ లో ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు.  స్వదేశంలో టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా రూపంలో కఠినమైన సవాలు ఎదురుకానుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న కీలక ప్లేయర్లు గాయాల బారిన పడిన నేపథ్యంలో టీమిండియా సొంత గడ్డ పైన ఎంతో బలహీనం గా మారుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. పంత్, రవీంద్ర జడేజా, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయం బారిన పడి  జట్టుకు దూరం కావడంతో ఇక సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతున్నా టీమిండియా బలహీనంగానే కనిపిస్తుంది.  ఇంకా చెప్పాలంటే కోహ్లీ పైన జట్టు మొత్తం ఆధారపడి చాన్స్ ఉంది. భారం మొత్తం అతడిదే. భారత్ లోని పిచ్ లు స్పినుకు అనుకూలంగా ఉంటాయి అందుకే ఆసిస్ బౌలర్ అగర్ కి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. నాథన్ లియోన్ తో కలిసి అతను రానించగలడు అంటూ గ్రేగ్ చాపల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: