టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ  అంతా ఇంత కాదు అన్న విషయం తెలిసిందే. నేటి జనరేషన్ క్రికెటర్లలో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇక ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు. ఏకంగా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్లతో సమానంగా తన ఫాలోవల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలా పాపులారిటీ ఉంది కాబట్టే ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కూడా కోట్ల రూపాయలు వెనకేసుకోగలుగుతున్నాడు రన్ మిషన్. అయితే విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్స్ ప్రయత్నిస్తూ ఇక సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ ఇక గడ్డం విషయంలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభం అవ్వపోతున్న నేపథ్యంలో ఇక విరాట్ కోహ్లీ ఎలాంటి కొత్త స్టైల్ ని ప్రయత్నించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కోహ్లీ కొత్త హెయిర్ కట్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన పోస్ట్ కాస్త తెగ వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. కోహ్లీ కొత్త లుక్ అదిరిపోయింది వావ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. ప్రముఖ హెయిర్ స్టైలిష్ అలీం హకీమ్ కోహ్లీకి కొత్త హెయిర్ స్టైలింగ్ అందించారు అనేది తెలుస్తుంది. అయితే అలీమ్ హకీం కోహ్లీ ఒక్కడికి మాత్రమే కాదు ఎంతోమంది సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీకి హెయిర్ స్టైల్ సెట్ చేసిన తర్వాత అలీమ్ హకీమ్ ఏకంగా ఈ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఇది చూసిన అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు. కోహ్లీకి మంచి హెయిర్ స్టైల్ చేసిన అలీమ్ హకీంకి కృతజ్ఞతలు చెబుతున్నారు కోహ్లీ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: