ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ మరియు శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 275 పరుగులు చేయగా, శ్రీలంక కేవలం 76 పరుగులకే ఆల్ అవుట్ కావడం విశేషం. ఇక కివీస్ బౌలర్ల ధాటికి 198 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయకేతనం ఎగరవేసింది. హెన్రీ షిప్లి ఐదు వికెట్లు తీయగా, టిక్నర్, మిచెల్ రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయ పతన నిలబెట్టారు. ఇక చాలాసార్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని సంఘటనలు చూస్తూనే ఉంటాం అయితే న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో కూడా ఎవరు ఊహించని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేంటో చూద్దాం.

టెక్నికల్ గా జరిగిన చిన్న సమస్య వల్ల అవుట్ కావలసిన శ్రీలంక బ్యాట్స్మెన్ అవుట్ అయినా కూడా కానట్టుగా ప్రకటించాడు ఎంపైర్. విషయంలోకి వెళ్తే శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 18వ ఓవర్లో క్రిస్ లో కరునరత్నే ఉన్నాడు. టిక్నర్ బౌలింగ్లో నాలుగవ బంతి సింగిల్ తీయడానికి కరుణరత్నే ప్రయత్నించగా ఫీల్డ్ నాన్ స్ట్రైకర్ వైపు బాల్ ని విసిరాడు. దాంతో టిక్నర్ ఆ బంతిని పట్టుకుని స్టంప్స్ ని పడగొట్టాడు. అలాగే థర్డ్ ఎంపైర్ కి రిఫర్ కూడా చేశాడు అయితే బాల్ స్టంప్స్ ని తాకిన సమయంలో కరుణ రత్నే చాలా దూరంలో ఉన్నాడు. దాంతో అందరూ అతడు అవుట్ అని భావించారు.

కానీ బాల్ స్టంప్స్ కి తగలగానే వెలగాల్సిన ఆ జింగ్ బెయిల్స్ బ్యాటరీ అయిపోవడంతో వెలగలేదు దాంతో ఎంపైర్ ఔట్ కాలేదని భావించి కరుణ రత్నేను నాటౌట్ గా డిక్లేర్ చేశాడు. కానీ వీడియోలు చూసిన వారందరికీ కరుణ రత్నే క్లియర్ గా అవుట్ అని తెలుస్తోంది. అలాగే ఎంపైర్ నిర్ణయంతో కివీస్ ఆటగాళ్లు సైతం షాక్ కి గురయ్యారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఇలా ఒక రనాడ విషయంలో జింగ్ బెయిల్స్ వెలగకపోవడం అనేది చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి కావడం కూడా విశేషం. అయితే ఇందులో అంత తప్పు లేదని రూల్స్ ప్రకారమే నాట్ అవుట్ గా డిక్లేర్ చేశారని కొంతమంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: