
వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసి ఫైనల్ నేపథ్యంలో కొంతమంది ఆటగాళ్లకు బిసిసిఐ ఐపీఎల్ నుంచి కొన్ని మ్యాచ్లు ఒక విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇలా కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంటాడని ఇక ఇలా రోహిత్ దూరంగా ఉన్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ చేపడతాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కథ ఇటీవలే మీడియా సమావేశంలో పాల్గొన్న ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురయింది అని చెప్పాలి
దీంతో ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ లీగ్ దశలో బ్యాటింగ్లో అదరగొడితే కొన్ని మ్యాచ్లకు అతనికి విశ్రాంతి ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. అతను కెప్టెన్. రోహిత్ మునుపటి ఫామ్ ను అందుకుంటాడని భావిస్తున్న. అతను విశ్రాంతిని కావాలని కోరుకుంటాడని అనుకోవట్లేదు. అయితే పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటాం. కెప్టెన్గా ఆటగాడిగా అతను అత్యుత్తమంగా రాణిస్తే బాగుంటుంది. ఒకటి రెండు మ్యాచ్లకు విశ్రాంతి తీసుకుంటే తీసుకోని.. అభ్యంతరం ఏం లేదు అంటూ ముంబై హెడ్ కోచ్ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు.