
ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ అటు ఐపీఎల్ హిస్టరీలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సాధించిన ఒక అరుదైన రికార్డు గురించి ఇటీవల చర్చించుకుంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అటు ఐపిఎల్ లో డిపెండింగ్ ఛాంపియన్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడైతే చెత్త ప్రదర్శన చేసి విమర్శలు ఎదుర్కొంటుంది. కానీ ఒకప్పుడు పటిష్టమైన బౌలింగ్ విభాగంతో ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించేది. సన్రైజర్స్ హైదరాబాద్ ఇక 2016లో ఐపిఎల్ టైటిల్ కూడా గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. ఫైనల్స్ లో బెంగళూరు జట్టును ఓడించి టోపీని ముద్దాడింది
అయితే ఇలా ఐపిఎల్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా ఒక అరుదైన రికార్డ్ సృష్టించగా ఇప్పటికి ఆ రికార్డు పదిలంగానే ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎలిమినేటర్స్ లో క్వాలిఫైయర్ 2 లోను గెలిచి కప్పు కొట్టిన ఏకైక జట్టుగా సన్రైజర్స్ కొనసాగుతుంది. ఎలిమినేటర్స్ లో కోల్కతాను ఓడించిన సన్రైజర్స్ క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ లయన్స్ ని ఫైనల్స్లో ఆర్సిబి ని ఓడించి కప్పు గెలుచుకుంది. అయితే ఇటీవల 2023 ipl ఎలిమినేటర్ లో ముంబై గెలిచి ఇక క్వాలిఫైయర్ 2 లో ఓడిపోవడంతోసన్రైజర్స్ రికార్డు పదిలంగానే ఉంది అని చెప్పాలి.