బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావాలని విదేశీ క్రికెటర్లు తెగ ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ లీగ్ లో భాగం కావడం వల్ల ఎంతోమంది అనుభవంగల క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకొని అపారమైన అనుభవం సాధించడమే కాదు.. కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పొందవచ్చు అని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏకంగా ఇక తమ దేశ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకొని మరి ఐపిఎల్ లో ఆడటానికి దేశ విదేశాల నుంచి కూడా తరలివస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెటర్లు. ఇక ఇలా ఐపిఎల్ లో ఆడే వారిలో యంగ్ క్రికెటర్స్ ఎక్కువగా ఉంటారు అని చెప్పాలి.


అయితే ఇలా అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడటానికి ఆసక్తి చూపుతూ ఉంటే కొంతమంది క్రికెటర్లు మాత్రం దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ.. ఐపీఎల్ లాంటి టోర్నీలకు దూరంగా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా ఐపిఎల్ కు దూరంగా ఉంటూ దేశం తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడాలని ఆశ పడుతున్న క్రికెటర్లలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఒకరు అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్గా కొనసాగుతున్నాడు.  ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ తన బౌలింగ్ తో  అదరగొడుతూ ఉంటాడు.



 అయితే ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లు ఆడుతూ పదేళ్ల కెరియర్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో  ఇక మిచెల్ స్టార్ కు సంతోషం వ్యక్తం చేశాడు. అదే సమయంలో తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఫాస్ట్ బౌలర్కు ఇది అంత సులువు కాదు. ఇతర లీగ్ లు ఆడక పోవడం వల్ల ఇది సాధ్యమైంది అంటూ స్టార్క్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో వచ్చే డబ్బు కంటే ఇక ఆస్ట్రేలియాకు 100 టెస్టులు ఆడటమే తనకు ముఖ్యం అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున రెండు సీజన్లు మాత్రమే ఆడిన స్టార్క్ ఆ తర్వాత ఐపీఎల్ టోర్నీకి పూర్తిగా దూరమైపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl