ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న పటిష్టమైన టీమ్స్ లలో ఒకటిగా కొనసాగుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక గత కొంతకాలం నుంచి మంచి ప్రదర్శన చేయడమే కాదు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ర్యాంకింగ్స్ లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికే టీ20 లలో భారత జట్టుతో పాటు భారత ఆటగాళ్లు కూడా అగ్రస్థానంలోనే ఉన్నారు. ఇక టెస్ట్ ఫార్మట్ లోను ప్రస్తుతం టీమిండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు మిగిలి ఉన్న వన్డే ఫార్మాట్లో కూడా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది టీమ్ ఇండియా. ఇలా ఒకేసారి మూడు ఫార్మాట్లలో కూడా ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న జట్టుగా అరుదైన రికార్డింగ్ ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. ఆసియా కప్ ను ఎంతో విజయవంతంగా ముగించుకున్న టీమిండియా ఇక టైటిల్ విజేతగా కూడా నిలిచింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఉన్న చిన్న గ్యాప్ లో  ఆస్ట్రేలియా తో సొంత గడ్డపైవన్డే సిరీస్ ఆడుతుంది టీమ్ ఇండియా.


 అయితే ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా హోరాహోరీ పోరు జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వన్డే సిరీస్ లో భాగంగా ఎవరు గెలుస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.  అయితే మొదటి మ్యాచ్లో విజయం సాధిస్తే టీమ్ ఇండియా వన్డే ఫార్మాట్లో కూడా అగ్రస్థానాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ఇక వచ్చిన అవకాశాన్ని టీమిండియా ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది. మొదటి మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. వన్డే ఫార్మాట్ లో కూడా ఐసిసి ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే అన్ని ఫార్మట్లలో భారత జట్టు ఒకే సమయంలో అగ్రస్థానానికి చేరిన జట్టుగా నిలిచింది. భారత్ కంటే ముందు దక్షిణాఫ్రికా ఈ ఘనత సాధించింది. అయితే భారత టెస్టుల్లో 118, వన్డేలో 116, t20 లలో 264 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: