
ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పోలీసులకు పోలీసులకు దొరికిపోయాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అయితే అతివేగంతో కారు నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు బాబర్ కి ఫైన్ వేశారు. అయితే ఎంత జరిమానా విధించారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బాబర్ తన తెలుపు రంగు ఆడి కార్ లో హైవేపై అతివేగంగా దూసుకు వెళ్ళాడు. అయితే పరిమితికి మించిన వేగంతో కారు నడుపుతున్న అతడిని పంజాబ్ వాహన పోలీసులు ఆపి జరిమానా విధించారు. ఈ క్రమంలోనే బాబర్కు ఒక పోలీస్ అధికారి ఫైన్ వేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అని చెప్పాలి.
ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన ఈ ఫోటో చూసి ఫాన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. అయితే వరల్డ్ కప్ కోసం భారత్ రానున్న పాకిస్తాన్ అధికారిక మ్యాచ్లకు ముందే రెండు మ్యాచ్లు ఆడబోతుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో, 30వ తేదీన ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో తలబడబోతున్నాయి. అయితే.. ప్రపంచ కప్ చరిత్రలో దాయాదిపై టీమిండియాదే పైచేయిగా వస్తోంది. మొన్న ఆసియా కప్ లో కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది భారత జట్టు. ఇప్పుడు కూడా భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగపోతుంది.