సాధారణంగా భారత్, పాకిస్తాన్ దేశాలను శత్రు దేశాలుగా అభివర్ణిస్తూ ఉంటారు ప్రపంచ ప్రజానీకం. ఈ రెండు దేశాల సరిహద్దుల వద్ద ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే సరిహద్దుల వద్ద వైరం కొనసాగడమే కాదు.. ఇక క్రికెట్లో కూడా ఈ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే అభిమానులు ఇలా దాయాదుల పోరుని ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. కానీ ఇరు జట్ల క్రికెటర్లు మాత్రం ఇక స్నేహభావంతో మెలుగుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇలా ఇరు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు స్నేహభావంతో మెలిగినప్పటికీ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఉన్న కొంతమంది సభ్యులు మాత్రం ఇక ఎప్పుడూ ఆ భారత్ పై విషయం కక్కుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ జాకా ఆశ్రప్ అందరి ఆగ్రహానికి గురవుతున్నాడు. ఏకంగా భారత అభిమానులతో పాటు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా అతని మాట తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.


 ఈ క్రమంలోనే తమకు దక్కిన స్వాగతం పట్ల పాకిస్తాన్ క్రికెటర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్న జాకా ఆశ్రప్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాంట్రాక్టు కార్యక్రమంలో అష్రాఫ్ మాట్లాడుతూ.. ప్రేమ ఆప్యాయతతో మా ఆటగాళ్లకు  ఈ కాంట్రాక్టులు ఇచ్చాం. పాక్ క్రికెట్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎప్పుడు ఇవ్వలేదు  టోర్నీల కోసం ఇతర దేశాలకు శత్రుదేశానికి వెళ్లే పాకిస్తాన్ క్రికెటర్లలో ఉత్సాహం నింపడమే మా లక్ష్యం అంటూ అష్రాఫ్ కామెంట్ చేశాడు. ఇక ఈ తన మాటలలో పరోక్షంగా భారత్ ను శత్రుదేశం అనడంపై నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ చెత్త బుద్ధిని బయటపెట్టారు అంటూ భారత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc