క్రికెట్ సమరంలో గొప్ప పోరుగా భావించే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంత ఉత్కంఠ గా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఉత్కంఠ బరితమైన పోరు ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఒక్కసారి కూడా వరల్డ్ కప్ లో పరాజయం చవిచూడని భారత్.. 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా మరోసారి విజయాల పరంపరను కొనసాగించింది. వరుసగా ఎనిమిదవ సారి పాకిస్తాన్ చిత్తూ  చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్న ఇక ఈ మ్యాచ్ లో ఆటగాళ్ల ప్రదర్శనకు సంబంధించి మాత్రం చర్చ ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా పాకిస్తాన్ తురుపు ముక్కగా పేరుపొందిన షాహిన్ ఆఫ్రిది భారత్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు తీసినప్పటికీ పెద్దగా తన బౌలింగ్ తో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు అని చెప్పాలి. సాధారణంగా అయితే కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ లను  వనికిస్తూ ఉంటాడు ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. కానీ ఇటీవలే భారత్తో జరిగిన మ్యాచ్ లో మాత్రం రోహిత్ శర్మ దూకుడు ముందు ఏం చేయాలో తెలియక తడబడిపోయాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో షాహిన్ ఆఫ్రిది ప్రదర్శన గురించి భారత లెజెండరీ క్రికెటర్ రవి శాస్త్రి షాకింగ్ కామెంట్ చేశాడు. షాహిన్ ఆఫ్రిది ఏమీ పాక్ వెటరన్ వసీం అక్రమ్ కాదని.. అతడిని ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు రవి శాస్త్రి. ఒకవేళ ఏ ఆటగాడు మంచి ప్రదర్శన కనబరిస్తే.. అతడిని మంచి ప్లేయర్ అనడం వరకే మన పొగడ్తలను పరిమితం చేస్తే బాగుంటుంది అంటూ సూచించాడు. షాహిన్ అంత గొప్ప బౌలర్ ఏమీ కాదు.. ఆ విషయాన్ని మనం అంతా అంగీకరించాలి పేర్కొన్నాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc