ఇండియా వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత జట్టు ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకుపోయినప్పటికీ అటు ఆస్ట్రేలియా మాత్రం చివరి అడుగులో ఫైనల్ లో భారత జట్టును దెబ్బ కొట్టింది. ఏకంగా ఫైనల్లో తమకు ఉన్న అనుభవాన్ని మొత్తం రంగరించి టీమిండియాను.. సొంత గడ్డమీద ఓడించింది. దీంతో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది ఆస్ట్రేలియా జట్టు.


 అయితే సాధారణంగా ఇలా వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ఈ ప్రపంచకప్ ట్రోఫీని ఆటగాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా దేవుడు దిగివచ్చి ఒక అపురూపమైన వరం ఇచ్చాడేమో అన్నట్లుగా వరల్డ్ కప్ ట్రోఫీకి గౌరవం ఇస్తూ ఉంటారు. కానీ భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో కప్పు గెలిచిన ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం ఈ ట్రోఫీని అవమానించారు అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ టైటిల్ ను కాళ్ళ కింద పెట్టుకొని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ బీర్ తాగుతూ ఫోటోలు ఇవ్వడం వివాదంగా మారిపోయింది. అతను వరల్డ్ కప్ ట్రోఫీని అగౌరపరిచాడు అంటూ అందరూ విమర్శలు చేస్తూ ఉన్నారు.



 అయితే ఇలాంటి విమర్శలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు తనపై వస్తున్న విమర్శల గురించి స్వయంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  మరోసారి కూడా అలా కాలు పెట్టడానికి నేను రెడీగా ఉన్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం  ఇందులో అగౌరపరచడం ఏమీ లేదు  అది వివాదాస్పదం అయిందన్న విషయం కూడా నాకు తెలియదు. ఇతరులు నాకు చెప్పారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నేను చూడను.. కావాలంటే మళ్లీ కాళ్ళు పెట్టడానికి కూడా నేను సిద్ధం అంటూ మిచెల్ మార్ష్ కామెంట్ చేయడం అందరిని షాక్ కి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: