
అయితే ప్రస్తుతం 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి అన్ని సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ కూడా జరగబోతుంది అయితే ఈ మినీ వేలం ప్రక్రియ దుబాయ్ వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం అయితే కనీసం ఐపీఎల్ సీజన్ అయినా ఈ ఏడాది భారత్ వేదికగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.
అయితే అటు ఐపిఎల్ 2024 సీజన్ నిర్వహణ విషయంలో బీసీఐకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఐపీఎల్ 2024ను అటు ఇండియాలో నిర్వహించాల లేకపోతే వేదికను మార్చాలా అనే విషయంపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇండియాలో ఐపీఎల్ నిర్వహించాలి అంటే భద్రత ఏర్పాట్లు కష్టమవుతాయి. ఒకవేళ మార్చి కన్నా ముందే ఐపిఎల్ నిర్వహించాలనుకున్న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. ఎన్నికల తర్వాత జరపాలంటే టి20 వరల్డ్ కప్ అడ్డు వస్తుంది. దీంతో ఐపీఎల్ లో స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తోంది.