బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2008లో ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఇక మహిళా క్రికెట్ ను కూడా ఇదే రీతిలో ప్రోత్సహించడానికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనే ఒక టి20 టోర్నీని ప్రారంభించింది బీసీసీఐ.


 అయితే ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత అటు మహిళా క్రికెటర్ల జీవితాలు మొత్తం మారిపోయాయి అని చెప్పాలి. అప్పటివరకు సరైన వేతనాలు లేక.. గుర్తింపు రాక ఎంతో ఇబ్బంది పడిన మహిళా క్రికెటర్లు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తో పురుషులతో సమానంగానే ఇక వేలంలో భారీ ధర పలుకుతూ ఉండడం.. అంతేకాదు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఊహించని రీతిలో పాపులారిటీ సాధిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి ఉన్న క్రేజ్ కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది అని చెప్పాలి. అయితే 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.


 కాగా ఈనెల 9వ తేదీన మహిళా ప్రీమియర్ లీగ్ వేలం జరగబోతుందట. రెండవ ఎడిషన్ వేయడానికి సంబంధించి 165 మంది క్రికెటర్లతో కూడిన జాబితాను నిర్వాహకులు ఇటీవల విడుదల చేశారు. అయితే 14 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు అని చెప్పాలి. మొత్తంగా వీరిలో 56 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఐదు జట్లు పాల్గొనే ఈ వేలంలో 30 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. గుజరాత్ జెయింట్స్ జట్టుకి అత్యధికంగా 10 స్లాట్లు అందుబాటులో ఉండడం గమనార్హం. కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్లో  ముంబై ఇండియన్స్ విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl