టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు భారత మాజీగా కొనసాగుతున్న గౌతమ్ గంభీర్ ఒకప్పుడు భారత క్రికెట్లో మాత్రం మోస్ట్ వాంటెడ్ క్రికెటర్ గా కొనసాగాడు. ఏకంగా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా ప్రస్తానాన్ని కొనసాగించాడు అని చెప్పాలి. భారత జట్టు ధోని కెప్టెన్సీలో రెండు వరల్డ్ కప్ లు గెలిచింది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ రెండు వరల్డ్ కప్ లో గెలవడంలో.. గౌతమ్ గంబీర్ ఓపెనర్ గా పోషించాడు అన్న విషయం తెలిసిందే. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి వరల్డ్ కప్ టోర్నీలలో భారత జట్టు విజయపతంలో ముందుకు నడవడంలో కీలకపాత్ర వహించాడు గౌతం గంభీర్.


 అయితే గంభీర్ తన అగ్రెసివ్ ఆటతీరుతో ఎప్పుడో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే గంభీర్  ఆటలో మాత్రమే కాదు ప్రవర్తనలో కూడా ఇలాంటి దూకుడే ఉంటుంది. ఈ క్రమంలోనే అతను క్రికెటర్ గా కొనసాగుతున్న సమయంలో.. ఎంతో మంది ప్రత్యర్థులతో గొడవలు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడే గంభీర్ ఇలా వివాదాలతో కూడా చాలాసార్లు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే ఇక ఇప్పుడు మాజీ క్రికెటర్ గా మారిన తర్వాత కూడా గంభీర్ లో ఇలాంటి దూకుడు ఎక్కడ తగ్గలేదు అని చెప్పాలి.


 ప్రస్తుతం ఈ మాజీ ఓపెనర్ లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మ్యాచ్లో గౌతమ్ గంభీర్ మరోసారి గొడవపడ్డాడు. ఈ టోర్నీలో తన ప్రత్యర్థి ఆటగాడిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ ప్లేయర్ శ్రీశాంత్, గంభీర్ కి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే గొడవ అనంతరం గంభీర్  ఇన్స్టా పోస్ట్ పై శ్రీశాంత్ కామెంట్ పెట్టాడు. నువ్వు నన్ను చాలా సార్లు ఫిక్సర్  అన్నావు. నువ్వు ఏమైనా సుప్రీంకోర్టు కంటే ఎక్కువా? అంపైర్లను కూడా దూషించావు. ఎప్పుడు సహచర క్రికెటర్లతో గొడవ పడతావు. నిన్ను దేవుడు కూడా క్షమించడు. ఆయన అన్ని చూస్తున్నాడు అంటూ రాసుకొచ్చాడు శ్రీశాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: