టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎంతోమంది బ్యాట్స్మెన్లు ఇక కాస్త ఎక్కువ పరుగులు చేస్తూ అదరగొడుతూ ఉంటారు అని చెప్పాలి. క్రీజులోకి రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు. ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి టి20 ఫార్మాట్లో ఏకంగా స్కోరుబోర్డు సైతం పరుగులు పెట్టి అలసిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చాలామంది ఆటగాళ్లు పొట్టి ఫార్మట్ లో సిక్సర్లు కొట్టడం విషయంలో కూడా రికార్డులు సాధిస్తూ ఉంటారు.


 అయితే ఇలా పొట్టి ఫార్మాట్లో విధ్వంసకరమైన ఆట తీరుతో ఎప్పుడు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటాడు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ అయిన మాక్స్ వెల్. ఇక అతను ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే సృష్టించే విధ్వంసం ఎంతో భయంకరంగా ఉంటుంది అన్నది విశ్లేషకులు రకరకాలుగా చెబుతూ ఉంటారు  మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు మ్యాక్స్ వెల్. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇక అతను ఎంతో వీరోచితమైన పోరాటం చేశాడో ప్రేక్షకులందరూ చూసి ఫీదా అయిపోయారు అని చెప్పాలి.


 ఇలా ఎప్పుడు విధ్వంసకరమైన ఆటతీరుతో ఆకట్టుకునే మ్యాక్స్వెల్ ఇటీవల సిక్సర్ లు కొట్టడం విషయంలో ప్రపంచ రికార్డులు సృష్టించాడు. టి20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో బ్యాట్స్మన్ గా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు 96 బ్యాచ్లలో 125 సిక్సర్లు బాదాడు మాక్స్ వెల్. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ పించ్ 125 సిక్సర్ల రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. కాగా ఈ లిస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 190 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక రెండో స్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గాప్తిల్  173 సిక్సర్లతో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: