ఈ రోజు గడిస్తే ఇంకా ఒక్కరోజు మాత్రమే. ఆ ఒక్కరోజు వేచి చూసాం అంటే చాలు ఇన్నాళ్ల నుంచి మేము ఎదురు చూస్తున్న క్రికెట్ పండుగ మొదలు కాబోతుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే తమ అభిమాన టీమ్స్  తలబడబోతున్నాయి. ఇక ఐపీఎల్ టోర్ని  చూసి ఎంజాయ్ చేసేందుకు మేము వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం అంటూ ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా చర్చించుకుంటున్నారు. రేపు ఒక్కరోజు గడిస్తే చాలు మార్చి 22వ తేదీ నుంచి అటు ఐపీఎల్ టోర్ని ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతుంది.


 ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్లో పాల్గొనబోయే పది టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఇప్పటికే ప్రాణాలికలను సిద్ధం చేసుకున్నాయ్. కొన్ని టీమ్స్ ఏకంగా కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్ ప్రారంభమైంది అంటే చాలు ఎక్కడ లేని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందుతూ ఉంటుంది. అయితే ఐపీఎల్లో ఇంత ఎంటర్టైన్మెంట్ అందడానికి కారణం.. కేవలం మైదానంలో బరిలోకి దిగి క్రికెట్ ను కొనసాగించే ఆటగాళ్లు మాత్రమే కాదు.. ఇక మ్యాచ్లను తమ గాత్రంతో మరింత ఉత్కంఠ భరితంగా మార్చే కామెంటేటర్లు కూడా అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐపీఎల్ ఉచితంగా ప్రసారం చేయబోయే జియో సినిమా ఇక కామెంట్రీ బాక్స్ లో ఉండే  వ్యాఖ్యాతల వివరాలను ప్రకటించింది అని చెప్పాలి.


 అయితే క్రికెట్ మ్యాచ్లలో కొందరు మాజీ ఆటగాళ్ళ కామెంట్రీ లు ఎప్పుడు ప్రత్యేకమే. అలాంటి వారిలో భారత మాజీ కోచ్ రవి శాస్త్రి, సిద్దు, సేహ్వాగ్ లాంటి ఆటగాళ్ల కామెంట్రీ అంటే ఇక ప్రేక్షకులు తెగ ఇష్టపడుతూ ఉంటారు.  ముఖ్యంగా సిద్ధూ కామెంట్రీ బాక్స్ లో ఉన్నాడు అంటే చాలు ఇక ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పక్క అని చెప్పాలి. ఎందుకంటే తనదైన శైలిలో వేసే చలోక్తులు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ కి కూడా కామెంట్రీ అందించబోతున్నాడు సిద్దు. ఇక ఇలా కామెంట్రీ అందించినందుకు గాను ఒక్క రోజుకి 25 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl