ఎప్పటిలాగానే ఐపీఎల్ 17వ సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శనలతో ఎంతల నిరాశ పరుస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా వరుసగా ఓటమిని చవిచూస్తూ అభిమానులందరినీ కూడా  ఆందోళన కలిగిస్తుంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం కాదు.. కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందా లేదా అనే అనుమానం అభిమానూల్లోనే వచ్చేసింది.


 అయితే బెంగళూరు టీం బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ బౌలింగ్ విభాగం మాత్రం ఇక దారుణమైన ప్రదర్శనతో జట్టు ఓటమికి కారణం అవుతుంది. మరి ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్.. ఏకంగా ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఇక జట్టు ఓటములలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. అయితే ఈ ఐపీఎల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక అవుతాడు అనుకుంటే ఇప్పుడు అభిమానులను నిరాశ పరుస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న సమయం లో టీమిండియా తరఫున ఆడుతున్న ఏకైక తెలుగు ప్లేయర్ మహమ్మద్ సిరాజ్. అయితే ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. ఐపీఎల్ సీజన్లో అతను గణాంకాలు చూసి ఫ్యాన్స్ సైతం నిట్టూరుస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్లో ఆరు మ్యాచ్లలో అతను కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. మరోవైపు పరుగులు దారాళంగా సమర్పించుకుంటున్నాడు. దీంతో ఏంటి సిరాజ్.. వరల్డ్ కప్ లో ఆడాలని లేదా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకనైనా బౌలింగ్ లయను మార్చుకొని తిరిగి ఫాం సాధిస్తే బాగుంటుందని లేదంటే.. టి20 వరల్డ్ కప్ లో అతనికి చోటు దక్కడం కష్టమే అంటూ అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: