ఐపీఎల్ లాంటి టోర్నీలో భాగం కావాలని యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ప్లేయర్లు కూడా కోరుకుంటూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా అవకాశం వచ్చింది అంటే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టాలని ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే రికార్డులు గొట్టడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్ లో కూడా బరిలోకి దిగుతూ ఉంటారు.


 అయితే కొన్ని కొన్ని సార్లు నోటి దాకా వచ్చిన ముద్ద నేలపాలు అయినట్లు ఇక దాదాపుగా సాధించాము అనుకున్న అరుదైన అధికారులు చేజారిపోతూ ఉంటాయి. కొంతమంది ఆటగాళ్లు ఏకంగా 99 పరుగుల వద్ద వికెట్ కోల్పోయి చివరికి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు. అచ్చంగా ఇలాగే ఇక ఇటీవలే ఐపిఎల్ లో జరిగిన ఒక మ్యాచ్ లో జరిగింది   అతను మరో నాలుగు పరుగులు చేసి ఉంటే ఐపీఎల్ హిస్టరీ లోనే ఒక అరుదైన రికార్డు సృష్టించేవాడు. కానీ త్రుటిలో ఈ రికార్డు మిస్ అయింది.


 ఇలా రికార్డు మిస్ అయిన ప్లేయర్ ఎవరో కాదు సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు రెండు ఫోర్లు ఉన్నాయి అని చెప్పాలి. అయితే అతను అవుట్ అయిన బంతి ఫోర్ వెళ్లి ఉంటే ఐపిఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి ఉండేవాడు. కానీ త్రుటిలో అతను ఈ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కాగా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ ఓపెనర్లు బ్యాటింగ్ విధ్వంసం అంటే ఏంటో చూపించారు. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ జట్టు 67 పరుగులు తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl